: రూ. 688 కోట్ల బంగారు విమానంలో మలేషియా సుల్తాన్ ఆస్ట్రేలియా యాత్ర


మలేషియాలోని అత్యంత ధనవంతుల్లో ఒకరైన జొహర్ సుల్తాన్ ఇబ్రహీం ఇస్మాయిల్, తన భార్య రాజా జరీత్ సోఫియాతో కలసి సెలవులు గడిపేందుకు ఆస్ట్రేలియాకు వచ్చిన వేళ, ఆయన ప్రయాణించిన బంగారపు విమానాన్ని చూసి పెర్త్ వాసులు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. బోయింగ్ 737 లోహ విహంగాన్ని కొని, దాన్ని తన అభిరుచులకు అనుగుణంగా ప్రత్యేకంగా తయారు చేయించుకున్నారు ఇస్మాయిల్. 'గోల్డ్ జెట్' అనే పేరున్న ఈ విమానం ఖరీదు సుమారు రూ. 668 కోట్లు కాగా, ఇందులో సకల సదుపాయాలూ ఉంటాయి. అత్యంత విలాసవంతమైన డైనింగ్ హాల్, బెడ్ రూం, షవర్ తదితరాలతో పాటు మూడు వంట గదులు ఉంటాయి. కాగా, మొత్తం రూ. 7 వేల కోట్ల విలువైన ఆస్తులున్న ఈ సుల్తాన్ కు పెర్త్ లో భారీ భవంతి కూడా ఉంది.

  • Loading...

More Telugu News