: తుపాకీ కలిగి ఉన్నాడన్న కారణంతో 14 ఏళ్ల బాలుడిని హతమార్చిన అమెరికా పోలీసులు
అమెరికాలో 14 ఏళ్ల బాలుడిపై పోలీసులు కాల్పులు జరిపారు. లాస్ ఏంజెలిస్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంటి యజమాని తమ ఇంటిపక్కన కాల్పులు జరుగుతున్నాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అక్కడకు చేరుకున్న పోలీసులకి బాలుడు తుపాకీతో కనిపించాడు. పోలీసులని చూడగానే ఆ బాలుడు అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించాడు. దీంతో పోలీసులు బాలుడిపై కాల్పులు జరిపి అతడ్ని హతమార్చారు. అయితే, తాము బాలుడిని చూసి 20 ఏళ్ల వ్యక్తి అనుకున్నామని, తుపాకీ కలిగి ఉన్నాడన్న కారణంతో కాల్పులు జరిపామని పోలీసులు చెప్పారు.