: కృష్ణా నదిలో పుష్కర స్నానంతో పాప వినాశం!: నందమూరి బాలకృష్ణ
కృష్ణా పుష్కరాల్లో పవిత్ర స్నానం చేసేందుకు టాలీవుడ్ అగ్ర నటుడు, అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నిన్ననే సతీసమేతంగా విజయవాడ చేరుకున్నారు. నేటి ఉదయం తన బావ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు దంపతులతో కలిసి ఆయన దుర్గా ఘాట్ లో పుష్కర స్నానమాచరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కృష్ణా నదిలో పుష్కర స్నానంతో పాప వినాశం జరుగుతుందని చెప్పారు. తన తాజా చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ గెటప్ లోనే దుర్గా ఘాట్ కు వచ్చిన ఆయన సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచారు.