: ‘కోకోనట్’లో రాసలీలలు!... చర్చి హౌస్ లో ఒప్పందాలు!: గోవాలో నయీమ్ నయా లైఫ్ స్టైల్!


తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసుల బుల్లెట్లకు హతమైపోయిన గ్యాంగ్ స్టర్ నయీమ్ చీకటి కార్యకలాపాలు గోవాకు కూడా పాకాయి. ఏమాత్రం బోర్ కొట్టినా అమ్మాయిలను వెంటేసుకుని గోవా చెక్కేసే నయీమ్... అక్కడ ‘కోకోనట్’ పేరిట ఏర్పాటు చేసుకున్న విలాసవంతమైన గెస్ట్ హౌస్ లో వారితో రాసలీలల్లో మునిగిపోయేవాడట. అతడు చనిపోయిన తర్వాత పోలీసులకు చిక్కిన ఫర్హానా అతడికి ప్రధాన అనుచరురాలిగా పోలీసులు భావిస్తున్నారు. ఆమెను ‘కోకోనట్’ అంటూ ముద్దుగా పిలుచుకునే నయీమ్... ఆ పేరునే సదరు గెస్ట్ హౌస్ కు పెట్టుకున్నాడు. గోవా వెళ్లిన ప్రతిసారీ కొత్త అమ్మాయిని వెంటేసుకుని వెళ్లే నయీమ్... అక్కడి గోవా చర్చి పక్కనే ‘చర్చి హౌస్’ పేరిట ఏర్పాటు చేసుకున్న మరో గెస్ట్ హౌస్ లో కీలక ఒప్పందాలకు సంబంధించిన చర్చలు జరిపేవాడట. ఇక తాను హైదరాబాదులోనే ఉండే సమయంలో తనకు చెందిన వారిని కూడా నయీమ్ అక్కడికి పంపేవాడని చర్చి హౌస్ వద్ద వాచ్ మన్ గా పనిచేస్తున్న తాజుద్దీన్ అనే వ్యక్తి పోలీసులకు చెప్పాడు. ఈ రెండు గెస్ట్ హౌస్ లలో పెద్ద సంఖ్యలో సెల్ ఫోన్లు, సిమ్ కార్డులు ఉంటాయని కూడా తాజుద్దీన్ చెప్పాడు.

  • Loading...

More Telugu News