: బ్యాంకాక్‌లో బాంబు పేలుళ్లు.. మహిళ మృతి, పలువురు విదేశీయులకు గాయాలు


బ్యాంకాక్‌లోని ఓ రిసార్టులో గురువారం రాత్రి జరిగిన బాంబు పేలుళ్లలో ఓ మహిళ మృతి చెందింది. పలువురు విదేశీయులు తీవ్రంగా గాయపడ్డారు. క్వీన్ సిరికిట్ బర్త్ డే వేడుకల సందర్భంగా శుక్రవారం సెలవు దినం కావడంతో సెలెబ్రేట్ చేసేందుకు ప్రజలు హువా హిన్ రిసార్ట్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో రాత్రి పదిన్నర గంటల సమయంలో రెండు బాంబులు పేలాయి. ఓ మహిళ మృతి చెందగా పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురు విదేశీయులు ఉన్నారు. గాయపడిన వారిలో మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మొదటి బాంబు పేలిన 20 నిమిషాల తర్వాత మరో బాంబు పేలిందని పోలీసులు పేర్కొన్నారు. పేలుళ్ల వెనుక ఉన్న ఉద్దేశం తెలియరాలేదని, దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News