: జోగులాంబ సేవలో కేసీఆర్!... సతీసమేతంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు!
కృష్ణా పుష్కరాలను ప్రారంభించేందుకు మహబూబ్ నగర్ జిల్లా అలంపూర్ పరిధిలోని గొందిమళ్లకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేటి ఉదయమే ఆ కార్యాన్ని నిర్వఘ్నంగా పూర్తి చేశారు. అక్కడే ఏర్పాటు చేసిన ఘాట్ లో కృష్ణా నదిలో పుష్కర స్నానం చేసిన అనంతరం వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్న ఆయన నేరుగా అక్కడికి సమీపంలోని జోగులాంబ దేవాలయానికి వెళ్లారు. సతీసమేతంగా ఆలయంలోకి ప్రవేశించిన కేసీఆర్... జోగులాంబకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.