: జేజేలు పలికిన జనమే దుమ్మెత్తి పోస్తున్న వైనం.. ఒంటరైపోయిన ‘ఉక్కు మహిళ’ ఇరోమ్ షర్మిల


నిన్నమొన్నటి వరకు ప్రజలు ఆమెకు జేజేలు పలికారు. తమ కష్టాలు తీర్చేందుకు వచ్చిన దేవతవన్నారు. కానీ నేడు పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. అసలు నువ్వు ఇక్కడ ఉండనే వద్దని చీత్కరించుకుంటున్నారు. ప్రజలు తిరస్కరిస్తున్న ఆమె మరెవరో కాదు.. మణిపూర్‌లో ఆర్మ్‌‌డ్ ఫోర్సెస్ (స్పెషల్ పవర్స్) యాక్ట్‌(ఏఎఫ్‌ఎస్‌పీఏ) ను ఎత్తివేయాలని 16 ఏళ్లుగా దీక్ష చేసి, ఇటీవల విరమించిన ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిల. దీక్షను విరమించి రాజకీయాల్లోకి వచ్చి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని షర్మిల ప్రకటించడమే ప్రజల వ్యతిరేకతకు కారణంగా కనిపిస్తోంది. ఏఎఫ్‌ఎస్‌పీఏపై గతంలో ఎందరో రాజకీయ నాయకులు పోరాడి ఓడిపోయారని, ఇప్పుడు షర్మిల విషయంలోనూ అదే జరుగుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఆమెపై తాము గంపెడాశలు పెట్టుకుంటే నిలువునా ముంచిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఉంటున్న ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఒంటరైపోయిన షర్మిలకు షెల్టర్ ఇచ్చేందుకు రెడ్‌క్రాస్(మణిపూర్) ముందుకొచ్చింది. షర్మిల నిర్ణయాన్ని పలువురు రాజకీయ నాయకులు, సంఘసేవకులు స్వాగతిస్తుండగా ప్రజలు మాత్రం తిరస్కరిస్తుండడం గమనార్హం. భారత్‌లో పుట్టిన బ్రిటిష్ జాతీయుడు దేశ్‌మండ్ కౌటినోను పెళ్లి చేసుకుంటానని షర్మిల ప్రకటించడమే ప్రజల వ్యతిరేకతకు కారణమని సామాజిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆమె దీక్ష భగ్నం వెనుక అతడి ప్రమేయం ఉందని ప్రజలు భావిస్తున్నట్టు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News