: కారు అద్దాలు పగులగొట్టి 10 లక్షలు దోచేశారు
హైదరాబాదులో క్షణాల్లో జరిగిన చోరీ విస్మయానికి గురి చేస్తోంది. రాజేంద్రనగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదురుగా కారును పార్కు చేసి, కార్యాలయంలోకి వెళ్లి తిరిగి వచ్చి చూసేసరికి, కారు అద్దాలు పగులగొట్టి ఉండడాన్ని, కారులోని పది లక్షల రూపాయలు మాయమవ్వడాన్ని వారు గుర్తించారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోకి వెళ్లి వచ్చేలోపు కొంతమంది దుండగులు తమ 10 లక్షల రూపాయలు చోరీ చేశారని తెలిపారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.