: సోనియాకు స్వల్ప జ్వరం... మరికొన్నిరోజులు ఆసుపత్రిలోనే!


ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి స్వల్ప జ్వరం తలెత్తిన కారణంగా ఆసుపత్రిలో మరికొన్ని రోజులు ఉండనున్నారు. ఈ నెల 2వ తేదీన వారణాసిలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ రోడ్ షో లో పాల్గొన్న ఆమె అస్వస్థత కారణంగా అర్థాంతరంగా కార్యక్రమాన్ని ముగించుకుని ఢిల్లీ వెళ్లిపోయిన విషయం తెలిసిందే. సోనియా ఎడమ భుజం దెబ్బతినడంతో ఆసుపత్రి వైద్యులు ఈ నెల 3న శస్త్ర చికిత్స నిర్వహించారు. ఆమె బాగానే కోలుకున్నప్పటికీ ఇన్ ఫెక్షన్ కారణంగా స్వల్ప జ్వరం ఉన్నట్లు ఈరోజు ఉదయం పరీక్షించిన వైద్యుల బృందం తెలిపింది. యాంటీ బయాటిక్స్ వాడుతున్నామని, ఇన్ ఫెక్షన్ నుంచి ఆమె బయటపడతారని ఆసుపత్రి మేనేజ్ మెంట్ బోర్డు చైర్మన్ డాక్టరు డీఎస్ రాణా పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News