: ప్రకాశం బ్యారేజీపై వాహనాల రాకపోకలు నిషేధం... ద్విచక్రవాహనాలు, ఆటోలకు తప్పని ట్రాఫిక్ ఆంక్షలు


పుష్కరాల నేపథ్యంలో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీపై వాహనాల రాకపోకలపై నిషేధం విధించారు. విజయవాడ బస్టాండ్, కంట్రోల్ రూమ్, ప్రకాశం విగ్రహం, కుమ్మరిపాలెంలో వాహనాల రాకపోకలపై నిషేధం విధించారు. అదేవిధంగా ద్విచక్ర వాహనాలు, ఆటోల రాకపోకలపై కూడా నియంత్రణ విధించారు. భవానీపురం, సితార నుంచి వచ్చే ద్విచక్రవాహనాలను కుమ్మరిపాలెం వరకు; పంజా సెంటర్, కాళేశ్వరం మార్కెట్ నుంచి వచ్చే ద్విచక్రవాహనాలను అర్జునవీధి, బ్రాహ్మణ వీధి వరకు; కృష్ణలంక నుంచి వచ్చే ద్విచక్ర వాహనాలను రాఘవయ్య పార్క్ వరకు, బందర్ రోడ్డు నుంచి వచ్చే వాహనాలను వైజంక్షన్ వరకు మాత్రమే అనుమతించనున్నారు.

  • Loading...

More Telugu News