: విజయవాడ వెళ్లే భారీ వాహనాల దారి మళ్లింపు


కృష్ణా పుష్కరాల దృష్ట్యా విజయవాడ మీదుగా వెళ్లే భారీ వాహనాల దారిని మళ్లించారు. హైదరాబాద్- విశాఖపట్టణం, హైదరాబాద్- చెన్నై, విశాఖపట్టణం - చెన్నై వెళ్లే భారీ వాహనాలను విజయవాడ మీదుగా కాకుండా వేరే మార్గం ద్వారా పంపిస్తున్నారు. హైదరాబాద్- విశాఖ వెళ్లే భారీ వాహనాలను కంచికచర్ల, ఇబ్రహీంపట్నం, నూజివీడు, హనుమాన్ జంక్షన్ మీదుగా; విశాఖ - చెన్నై వెళ్లే భారీ వాహనాలను కత్తిపూడి మీదుగా అవనిగడ్డ, పెనుమూడి వారధి నుంచి ఒంగోలు వైపు మళ్లిస్తున్నారు. రాజమహేంద్ర వరం నుంచి చెన్నై వెళ్లే భారీ వాహనాలను గుడివాడ, చల్లపల్లి మీదుగా ఒంగోలు వైపునకు పంపుతున్నారు.

  • Loading...

More Telugu News