: అనుమతి పత్రాలివ్వలేదంటూ పురోహితుల నిరసన


మూడు నెలల క్రితం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్నప్పటికీ అనుమతి పత్రాలు ఇవ్వలేదని విజయవాడలో పురోహితులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై దేవాదాయ శాఖాధికారుల నుంచి స్పష్టమైన సమాధానం లేకపోవడంతో వీరు స్థానిక కోశావారి సత్రం, రైల్వేస్టేషన్ సమీపంలో నిరసనకు దిగారు. కాగా, పుష్కరాల్లో పిండ ప్రధాన కార్యక్రమాలు నిర్వహించే నిమిత్తం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న పురోహితులకు ఆయా ఘాట్లను కేటాయిస్తూ అనుమతి పత్రాలను మంజూరు చేశారు.

  • Loading...

More Telugu News