: మొదలైన అంత్యపుష్కరాల హారతి కార్యక్రమం...సందడి చేసిన టీడీపీ నేతలు


గోదావరి అంత్యపుష్కరాల ముగింపు ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 12 రోజులపాటు జరిగిన అంత్య పుష్కరాల కార్యక్రమం నేడు హారతి కార్యక్రమం అనంతరం ముగియనుంది. గోదావరి అంత్యపుష్కరాల కారణంగా రాజమహేంద్రవరంలోని పుష్కరఘాట్ సందడిగా మారింది. భక్తులు పెద్ద ఎత్తున పుణ్యస్నానాలు ఆచరించగా, గోదావరి హారతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సతీసమేతంగా పాల్గొనగా, పలువురు మంత్రులు, పార్టీ నేతలు, అధికారులు, కార్యకర్తలు రాజమహేంద్రవరం పుష్కరఘాట్ కు చేరుకుని, హారతి కార్యక్రమాన్ని వీక్షించారు. దీంతో అక్కడ పండగ వాతావరణం నెలకొంది.

  • Loading...

More Telugu News