: మహిళా మంత్రులంతా పాక్, చైనా సరిహద్దులకు కదలండి: మోదీ ఆదేశం


భారత సరిహద్దుల్లో నిత్యమూ కాపాలా కాస్తూ, శత్రువులు చొరబడకుండా రక్షిస్తున్న సైనికులకు మానసిక ధైర్యం కలిగించేందుకు భారతీయ జనతా పార్టీ మహిళా కేంద్ర మంత్రులంతా పాక్, చైనా సరిహద్దులకు వెళ్లాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు. ఆగస్టు 18న రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రతి మహిళా మంత్రి, వీలైనంత మంది మహిళా ఎమ్మెల్యేలు సరిహద్దులకు చేరుకుని సైనికులకు రాఖీలు కట్టి రావాలని సూచించారు. అందుబాటులోని సమాచారం ప్రకారం, జౌళి శాఖా మంత్రి స్మృతీ ఇరానీ సియాచిన్ కు వెళ్లనుండగా, ఆరోగ్య శాఖ సహాయమంత్రి అనుప్రియ జైసల్మేర్ కు, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ పంజాబ్ సరిహద్దులకు వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలు అయిన సందర్భంగా 23వ తేదీ వరకూ జాతీయ స్థాయిలో సంబరాలకు తెరలేపిన మోదీ, స్వాతంత్ర్య సమరయోధులు పుట్టిన గ్రామాలను, ప్రాంతాలను పార్టీ ఎంపీలు సందర్శించాలని కోరారు.

  • Loading...

More Telugu News