: అక్షయపాత్ర వంటశాలను పరిశీలించిన చంద్రబాబు


కృష్ణా పుష్కరాలకు విచ్చేసే భక్తుల ఆహార అవసరాల నిమిత్తం కృష్ణా జిల్లా విజయవాడ గొల్లపూడి మార్కెట్‌ యార్డులో ఏర్పాటు చేసిన అక్షయపాత్ర వంటశాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరిశీలించారు. పుష్కరాల సందర్భంగా ప్రతి రోజూ 3 లక్షల మంది ఆహార అవసరాలను అక్షయపాత్ర ఫౌండేషన్ ద్వారా ఏపీ ప్రభుత్వం తీర్చేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా చంద్రబాబు ఆ ఏర్పాట్లను పరిశీలించారు. అక్షయపాత్ర సిబ్బంది తయారు చేసిన వంటకాలను రుచి చూసిన సీఎం కొన్ని సూచనలు చేశారు. ఏర్పాట్లను సీఎం పర్యవేక్షిస్తున్న సమయంలో ఆయన వెంట పలువురు మంత్రులు, స్థానిక ఎంపీ కూడా ఉన్నారు.

  • Loading...

More Telugu News