: ఇక రోశయ్య వంతు!... కేసీఆర్ పై ప్రశంసలు కురిపించిన తమిళనాడు గవర్నర్!


మొన్న తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ... టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. తాజాగా ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రస్తుతం తమిళనాడు గవర్నర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కొణిజేటి రోశయ్య వంతు వచ్చింది. కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో నేటి ఉదయం పర్యటించిన రోశయ్య... కేసీఆర్ పాలనపై ప్రశంసలు కురిపించారు. తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తో కలిసి హరితహారంలో పాలుపంచుకున్న రోశయ్య... తాను కూడా ఓ మొక్క నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరితహారాన్ని కేసీఆర్ ప్రజా ఉద్యమంగా చేపడుతున్నారని అభినందించారు. రాష్ట్రాన్ని మొత్తం పచ్చదనంగా మార్చడంలో కేసీఆర్ విరివిగా మొక్కలు నాటిస్తున్నారని రోశయ్య కితాబిచ్చారు.

  • Loading...

More Telugu News