: కొడుకుతో కలిసి కూర్చుని... బెరుకు లేకుండా మాట్లాడిన ఉమా మాధవరెడ్డి!


గ్రేహౌండ్స్ పోలీసుల చేతిలో హతమైన గ్యాంగ్ స్టర్ నయీమ్ తో ప్రత్యక్ష సంబంధాలున్నాయంటూ వచ్చిన తీవ్రమైన ఆరోపణలను తిప్పికొట్టిన సందర్భంగా దివంగత హోం మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి సతీమణి, మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి ఎలాంటి బెరుకు లేకుండానే మాట్లాడారు. కొద్దిసేపటి క్రితం హైదరాబాదులోని తన నివాసంలో కుమారుడు సందీప్ రెడ్డితో కలిసి మీడియా ముందుకు వచ్చిన ఆమె చిద్విలాసంగానే ప్రసంగం మొదలుపెట్టి ప్రభుత్వంపై వ్యూహాత్మకంగా విరుచుకుపడ్డారు. తానేమీ మీడియా ముందుకు రావాలనుకోలేదని చెప్పిన ఆమె... మీడియానే తన వివరణ కోరితేనే తాను మీడియా సమావేశం పెట్టానని చెప్పారు. వెరసి మీడియా సంధించిన ప్రశ్నలకు ఆమె దీటుగానే సమాధానమిచ్చారు. నయీమ్ వ్యవహారంలో తన పేరు తీసుకొచ్చింది మీడియానేనని ఉమా మాధవరెడ్డి ఒకానొక సందర్భంలో మీడియా ప్రతినిధులకు నోట మాట రాకుండా చేశారు. స్థానిక మీడియా తన పేరు పెట్టకుండా పరోక్షంగా కథనాలు రాస్తే ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ లాంటి పత్రికలు తన పేరుతోనే కథనాలు రాశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వమైనా, పోలీసులైనా ఈ కేసులో తన ప్రమేయానికి సంబంధించిన ఆధారాలుంటే బయటపెట్టాలని కూడా ఆమె సవాల్ విసిరారు.

  • Loading...

More Telugu News