: నయీమ్ కేసులో ఏ1గా మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి?...కాసేపట్లో మీడియా ముందుకు టీ టీడీపీ నేత!


తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన గ్యాంగ్ స్టర్ నయీమ్ ఎన్ కౌంటర్ కేసులో మరింత సంచలనం కలిగించే అంశాలు వెలుగుచూస్తున్నాయి. నయీమ్ కు ఆశ్రయమివ్వడమే కాకుండా అతడు గ్యాంగ్ స్టర్ గా మారేందుకు సహకరించిన నల్లగొండ జిల్లాకు చెందిన మాజీ మంత్రిగా దివంగత నేత ఎలిమినేటి మాధవరెడ్డి సతీమణి ఉమా మాధవరెడ్డి తెరపైకి వచ్చారు. నయీమ్ ఎన్ కౌంటర్ పై ఇప్పటికే దర్యాప్తు బాధ్యతలు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఉమా మాధవరెడ్డిపై కేసు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కేసులో నయీమ్ కు బదులుగా ఉమా మాధవరెడ్డినే పోలీసులు ఏ1గా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరికాసేపట్లో ఉమా మాధవరెడ్డి మీడియా ముందుకు వస్తున్నారు. నల్లగొండలోని తన నివాసంలో ఆమె మరికాసేపట్లో మీడియా సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఉమా మాధవరెడ్డి ఎలాంటి విషయాలు చెబుతారన్న ఆసక్తి నెలకొంది.

  • Loading...

More Telugu News