: పాకిస్థాన్ క్వెట్టాలోని అల్ఖైర్ ఆసుపత్రి సమీపంలో బాంబు పేలుడు
ఉగ్రవాదులకు ఆశ్రయాన్నిస్తోందని తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్లో ఈరోజు ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఆ దేశంలోని క్వెట్టాలోని అల్ఖైర్ ఆసుపత్రి సమీపంలో ఈరోజు బాంబు పేలుడు సంభవించింది. పేలుడు ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయినట్లు తెలుస్తోంది. గాయాలపాలయిన వారిని ఆసుపత్రికి తరలించారు. భద్రతా బలగాలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. దాడికి పాల్పడింది తామే అంటూ ఇప్పటికి ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు.