: నయామ్ బెడ్ రూంలో వెయ్యి జతల దుస్తులు!... విగ్గులు, మేకప్ కిట్లు కూడానట!


తెలంగాణ గ్రేహౌండ్స్ చేతిలో హతమైన గ్యాంగ్ స్టర్ నయీమ్ జీవన శైలి విభిన్నంగా ఉందనడానికి మరింత మేర ఆధారాలు లభ్యమయ్యాయి. కోర్టు అనుమతితో నిన్న అలకాపురిలోని అతడి ఇంటిలోని బెడ్ రూంను బద్దలు కొట్టిన పోలీసులు అక్కడి వస్తువులను చూసి షాకయ్యారు. బెడ్ రూంలో 10 కాదు, 20 కాదు ఏకంగా వెయ్యి జతల దుస్తులు ఉన్నాయి. బాడీ బిల్డింగ్ పై కాస్తంత ఆసక్తి ఉన్న నయీమ్... సౌందర్య పోషణకు వినియోగించే మేకప్ కిట్లను కూడా తన బెడ్ రూంలో పెట్టుకున్నాడు. ఇక విగ్గులను కూడా అతడు సేకరించి పెట్టుకున్నాడు. వీటిని చూసి షాక్ తిన్న పోలీసులు బెడ్ రూంలో సోదాలు చేయగా... లెక్కకు మిక్కిలి బంగారు ఆభరణాలు, వజ్రాలు పొదిగిన ఆభరణాలు, పెద్ద సంఖ్యలో ప్రామిసరి నోట్లు లభించాయి.

  • Loading...

More Telugu News