: నయీమ్ నుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తులు మాకే చెందాలి: బాధితులు
ఎన్ కౌంటర్ కు గురైన కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ నయీమ్ బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. వందలాది మందిని బెదిరించి కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించిన నయీమ్ మృతి చెందడంతో, అతని బారినపడి ఆస్తులు పోగొట్టుకున్నవారు, నగదు పోగొట్టుకున్నవారు, బెదిరిపోయినవారు ఇప్పుడు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. నయీమ్ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న పత్రాల్లో తమ ఆస్తులకు సంబంధించిన పత్రాలు ఉంటాయని వారు పేర్కొంటున్నారు. చంపేస్తానని బెదిరించి తమ నుంచి ఆస్తులు కాజేశాడంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలా పోగొట్టుకున్న ఆస్తులను తమకే అందజేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం పెద్దమనసు చేసుకుని తమకు అండగా నిలబడాలని వారు కోరుకుంటున్నారు.