: కేసీఆర్ పుష్కర స్నానం ముహూర్తమిదే!


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుష్కర స్నానానికి ముహూర్తం కుదిరింది. ఈ నెల 12వ తేదీ (ఎల్లుండి) ఉదయం 5.58 నిమిషాలకు పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. ఆ ముహూర్తానికే మహబూబ్‌ నగర్‌ జిల్లా గొందిమళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుష్కర స్నానమాచరించనున్నారు. అయితే వీఐపీలు పుష్కర స్నానమాచరించే ప్రాంతంలోనే మిగతావారు కూడా పుష్కర స్నానం చేయాలని భావించకూడదని, పుష్కరాల సమయంలో నదిలో ఏ తీరంలో స్నానమాచరించినా పుణ్యమేనని ఆధ్యాత్మికవేత్తలు సూచిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News