: కాశ్మీర్లో పట్టుబడ్డ ఉగ్రవాదిని మీడియా ముందు ప్రవేశపెట్టిన ఎన్ఐఏ... పాక్ కుటిల బుద్ధి బట్టబయలు!


జూలై 25న జమ్మూకాశ్మీర్లో పట్టుబడ్డ ఉగ్రవాది బహుదూర్ అలీని ఎన్ఐఏ అధికారులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఉగ్రవాదులకు సంబంధించిన కీలక ఆధారాలను, పాకిస్థాన్ కుటిల బుద్ధిని మీడియా ముందు బహిర్గతం చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే) లో లష్కరే తొయిబా క్యాంపులు నిర్వహిస్తోందని అధికారులు అన్నారు. ప్రతి క్యాంపులో 30 నుంచి 50 మంది సభ్యులు ఉన్నారని ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు. ఈ క్యాంపుల్లో ఉగ్రవాదులకు అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేసి, ప్రణాళికాబద్ధంగా శిక్షణ ఇస్తోందని వారు వెల్లడించారు. కాశ్మీర్ పరిస్థితులను అవకాశంగా మలుచుకోవాలని లష్కరే తొయిబా భావిస్తోందని వారు తెలిపారు. బహుదూర్ అలీ వంటి ఉగ్రవాదులను సరిహద్దులు దాటించిందని వారు చెప్పారు. ఇలాంటి వారు చాలా మంది సరిహద్దుల అవతల అవకాశం కొసం ఎదురు చూస్తున్నారని వారు తెలిపారు.

  • Loading...

More Telugu News