: ఐజీ నాగిరెడ్డి నేతృత్వంలో 'సిట్' ఏర్పాటు
ఎన్ కౌంటర్ లో హతమైన గ్యాంగ్ స్టర్ నయీమ్ పై ఉన్న వివిధ కేసుల విచారణ నిమిత్తం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను డీజీపీ అనురాగ్ శర్మ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ బృందానికి నేతృత్వం వహించే అధికారిగా ఐజీ నాగిరెడ్డిని నియమించారు. నయిీమ్ కేసులపై నాగిరెడ్డి ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగనుంది. కాగా, నయీమ్ పై నమోదైన పలు కేసులను ఆయా పోలీస్ స్టేషన్లలో దర్యాప్తు చేస్తే సాంకేతిక సమస్యలు తలెత్తే ప్రమాద ముందని భావించిన డీజీపీ అనురాగ్ శర్మ సిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.