: పుష్కరాల 12 రోజులు పవిత్ర సంగమం వద్దే బస!: టాలీవుడ్ దర్శకుడు బోయపాటి ప్రకటన
కృష్ణా పుష్కరాలు జరిగే 12 రోజులూ పవిత్ర సంగమం వద్దే బస చేస్తానని టాలీవుడ్ అగ్ర దర్శకుడు బోయపాటి శ్రీను ప్రకటించారు. కొద్దసేపటి క్రితం విజయవాడలో ఓ తెలుగు న్యూస్ ఛానెల్ తో మాట్లాడిన సందర్భంగా ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు. పుష్కరాలు జరిగే అన్ని రోజులూ నిత్య హారతి ఉంటుందని కూడా ఆయన పేర్కొన్నారు. పవిత్ర సంగమం వద్ద జరుగుతున్న నిత్య హారతి ఏర్పాట్లు రేపు సాయంత్రానికి పూర్తి కానున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఏర్పాట్లలో భాగంగా ఫెర్రీ పవిత్ర సంగమం వద్ద భారీ సెట్టింగ్ వేసినట్లు ఆయన తెలిపారు.