: నయీమ్ బాధితుల జాబితా కూడా పెద్దదే!... జాబితాలో 20 మంది ప్రజాప్రతినిధులు!
తెలంగాణ పోలీసుల మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ నయీమ్ దోస్తానా చేసిన వారి జాబితాలో 15 మంది ఐపీఎస్ అధికారులున్నారన్న వార్తలు వెలువడిన వెంటనే అతడి బెదిరింపులకు గురైన వారి జాబితా కూడా వెలుగులోకి వచ్చింది. బెదిరింపులు, భూ కబ్జాలు, సెటిల్ మెంట్లతో నయా గ్యాంగ్ స్టర్ గా అవతారం ఎత్తిన నయీమ్... ఇప్పటిదాకా 20 మంది దాకా ప్రజా ప్రతినిధులను బెదిరించాడట. ఇక రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన 200 మంది బడా వ్యాపారులకు కూడా నయీమ్ నుంచి బెదిరింపులు ఎదురయ్యాయని పోలీసుల విచారణలో తేలింది. నయీమ్ నుంచి బెదిరింపులు ఎదుర్కున్న బాధితులలో తెలంగాణ సీఎం కేసీఆర్ సమీప బంధువు కూడా ఉన్న సంగతి తెలిసిందే.