: నయీమ్ ఇంటి వద్దకు ఏసీపీ గంగిరెడ్డి!... కోర్టు అనుమతితో బెడ్ రూం తలుపులు బద్దలుకొట్టిన వైనం!


తెలంగాణ పోలీసుల మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ నయీమ్ ఇంటి వద్ద మరోమారు కలకలం రేగింది. పాలమూరు జిల్లా షాద్ నగర్ వద్ద మొన్న చోటుచేసుకున్న ఎన్ కౌంటర్ లో నయీమ్ చనిపోయిన తర్వాత అతడి కార్యకలాపాలపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మొన్న రాత్రే అలకాపురి ఇంటిలో కోట్లాది రూపాయల నగదు, మారణాయుధాలు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ సమయంలో తాళం వేసి ఉన్న నయీమ్ బెడ్ రూం తలుపులు తెరిచేందుకు నిబంధనలు అడ్డురాగా అప్పుడు పోలీసులు వెనక్కు తగ్గారు. తాజాగా కోర్టు అనుమతితో నయీమ్ ఇంటి వద్దకు చేరుకున్న ఏసీపీ గంగిరెడ్డి ఇంటి గేటుకు వేసిన తాళాన్ని రెవెన్యూ అధికారుల సమక్షంలో తెరిచారు. ఆ తర్వాత ఇంటి లోపలికి వెళ్లిన గంగిరెడ్డి... తన సిబ్బందితో బద్దలు కొట్టించారు. ప్రస్తుతం ఆ గదిలో పోలీసులు సోదాలు చేస్తున్నారు. ఈ సోదాలు గంటల తరబడి కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News