: శంషాబాదులో మహిళ పట్ల అసభ్య ప్రవర్తన!... ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు!
హైదరాబాదు శివారులోని శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయంలోనూ మహిళలకు వేధింపులు తప్పడం లేదు. నేటి ఉదయం ఎయిర్ పోర్టుకు వచ్చిన ఓ మహిళా ప్రయాణికురాలి పట్ల ఇద్దరు వ్యక్తులు అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో షాక్ తిన్న బాధితురాలు వారి ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా అక్కడ ఉన్న పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుపై వేగంగా స్పందించిన పోలీసులు ఆమెపై అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.