: నా కడుపు కోతకు కారణం పోలీసులే: నయీమ్ తల్లి


‘నా కడుపు కోతకు కారణం పోలీసులే. నక్సలైట్లకు వ్యతిరేకంగా నా కొడుకును వాడుకున్న పోలీసులు, వారి తూటాలకే నా బిడ్డను బలిచేశారు’ అంటూ ఎన్ కౌంటర్ లో హతమైన గ్యాంగ్ స్టర్ నయీమ్ తల్లి తహేరా బేగం ఆరోపించారు. నయీమ్ మృతదేహాన్ని అతని స్వగ్రామమైన భువనగిరి పట్టణానికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా అక్కడి మీడియా ఆమెను పలుకరించగా, కన్నీటి పర్యంతమయ్యారు. నయీమ్ ను అతని భార్యాబిడ్డలు కడసారి చూసే అవకాశం కూడా లేకుండా పోలీసులు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. నాలుగు రోజుల క్రితమే తనను, తన కోడలు, ఇతర కుటుంబసభ్యులను పోలీసులు పట్టుకుపోయారని, తన కొడుకు మృతి చెందిన విషయం కూడా చెప్పకుండా తనను భువనగిరికి తీసుకువచ్చారని ఆమె వాపోయారు.

  • Loading...

More Telugu News