: రైల్లో తరలిస్తున్న ఆర్బీఐ డబ్బు రూ.5 కోట్లు కొట్టేశారు


తమిళనాడులోని సేలం నుంచి చెన్నై రిజర్వ్ బ్యాంక్ కు రైలులో తరలిస్తున్న డబ్బును దుండగులు సినీ ఫక్కీలో కొట్టేశారు. ఈ సంఘటనపై రైల్వే ఐజీ రామ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, రిజర్వ్ బ్యాంక్ కు చెందిన రూ. 340 కోట్ల నగదును సేలం నుంచి చెన్నైలోని రిజర్వ్ బ్యాంకు కార్యాలయానికి తరలిస్తుండగా ఈ సంఘటన జరిగిందన్నారు. ఈ ఘటనలో సుమారు రూ.5 కోట్ల నగదు చోరీకి గురైనట్లు వెల్లడించారు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.

  • Loading...

More Telugu News