: నయీమ్-పోలీసుల లింకులపై సీఎం కేసీఆర్ సీరియస్


గ్యాంగ్ స్టర్ నయీమ్ ఎన్ కౌంటర్ పోలీస్ శాఖను కుదిపేస్తోంది. పోలీసులు- నయీమ్ లింకులపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పోలీసులపై విచారణకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో హైదరాబాద్ లోని అడిషనల్ ఎస్పీని సిట్ అధికారులు విచారించనున్నారు. నయీమ్ డైరీలో నాలుగు రాష్ట్రాల ఐపీఎస్ లు, అడిషినల్ ఎస్పీలు, డీఎస్పీలు, ఇన్ స్పెక్టర్లకు సంబంధించిన వివరాలు ఉన్నట్లు తెలుస్తోంది. నయీమ్ డైరీ కనుక ఓపెనయితే ఐపీఎస్ ల బాగోతం బయటపడనుంది. కరీంనగర్, నల్గొండకు చెందిన డీఎస్పీలు, ఇన్ స్పెక్టర్లు, ఒడిశా ఛత్తీస్ గఢ్ ఐపీఎస్ లతో నయీమ్ కు నేరుగా సంబంధాలున్నట్లు ఈ డైరీ ద్వారా తెలుస్తోంది. మావోయిస్టుల ఆపరేషన్ నిమిత్తం ఒడిశా, ఛత్తీస్ గఢ్ ఐపీఎస్ అధికారులు నయీమ్ ను వాడుకున్నారని ఈ డైరీ సమాచారం.

  • Loading...

More Telugu News