: హీరో మోటో కార్ప్ సీఈఓగా మళ్లీ పవన్ ముంజల్
హీరో మోటో కార్ప్ సీఎండీ, సీఈఓగా పవన్ ముంజల్ మరో ఐదేళ్ల పాటు కొనసాగనున్నారు. ‘హీరో’ సీఎండీ, సీఈఓగా మరోసారి ఆయన ఎంపికైన విషయాన్ని సంస్థ ప్రకటించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30తో పవన్ ముంజల్ పదవీ కాలం ముగియనుంది. కంపెనీ హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ విక్రమ్ ను బోర్డు డైరెక్టర్ గా, కంపెనీ సెక్రటరీ, చీఫ్ కంప్లియన్స్ ఆఫీసర్ గా నీర్జా శర్మను నియమిస్తున్నట్లు కూడా ఆ ప్రకటనలో తెలిపారు.