: నయీమ్ భార్య వచ్చాకే అంత్యక్రియలు: నయీమ్ తల్లి
పోలీసుల ఎన్ కౌంటర్ లో నిన్న హతమైన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ నయీమ్ అంత్యక్రియలు ఆయన భార్యా పిల్లలు వచ్చిన తర్వాతే నిర్వహిస్తామని తల్లి తహేరా బేగం అన్నారు. భువనగిరిలోని నివాసంలో నయీమ్ మృతదేహాన్ని ఉంచారు. అతని భార్య, ముగ్గురు పిల్లలను ఇక్కడికి తీసుకువచ్చే వరకు అంత్యక్రియలు జరపమని, తమ మత సంప్రదాయం ప్రకారం భార్య వస్తేనే ఖననం చేస్తామని ఆమె పేర్కొన్నారు.