: రచయిత్రి శోభా డే వ్యాఖ్యలపై మండిపడుతున్న భారత్ క్రీడాకారులు


రియో ఒలింపిక్స్ కు వెళ్లిన భారత క్రీడాకారులు మెడల్స్ సాధించడంపై దృష్టి పెట్టకుండా అక్కడికి వెళ్లడం, సెల్ఫీలు దిగడం, వెనక్కి రావడం అన్న చందంగా మన క్రీడాకారుల ఆటతీరు ఉందంటూ ప్రముఖ రచయిత్రి శోభా డే చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు తలెత్తుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై ప్రముఖ క్రీడాకారులు షూటర్ అభినవ్ బింద్రా, బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాలా స్పందించారు. భారత క్రీడాకారులు ఒక మెగా ఈవెంట్ లో పాల్గొన్నందుకు సంతోషించాలి కానీ, ఈ విధంగా నిరుత్సాహపరచడం తగదంటూ వారు మండిపడ్డారు. అయితే, యావత్తు క్రీడా లోకం శోభా డే వ్యాఖ్యలపై విమర్శలు గుప్పిస్తున్నప్పటికీ తాను మాత్రం క్షమాపణలు చెప్పబోనని ఆమె అంటోంది.

  • Loading...

More Telugu News