: ఈ నెలాఖరుతో చంద్రబాబు ఇచ్చిన గడువు పూర్తవుతుంది... మరో పోరాటానికి సిద్ధం!: ముద్రగడ
కాపుల రిజర్వేషన్ల అంశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన గడువు ఈనెలాఖరుకి పూర్తవుతుందని కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అన్నారు. ఈరోజు కడప జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీలను అమలు చేయాలని తాము కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఇచ్చిన హామీలపై నిర్లక్ష్యం వహించొద్దని అన్నారు. వచ్చేనెల మొదటి వారంలో తమ భవిష్యత్ ప్రణాళిక ఖరారు చేస్తామని ముద్రగడ చెప్పారు. కాపుల ఉద్యమం సందర్భంగా తన కుటుంబ సభ్యులను అవమానించారని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, కాపు జాతి కోసం ఎన్ని బాధలైనా భరిస్తానని ఉద్ఘాటించారు.