: 16 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న కృష్ణా జిల్లాకు చెందిన షేక్ అమీర్ అలీ నల్గొండలో అరెస్ట్‌


దీన్‌దార్ అంజుమ‌న్ ఉగ్ర‌వాద సంస్థ స‌భ్యుడు షేక్ అమీర్ అలీని న‌ల్గొండ జిల్లాలో ఈరోజు కర్ణాటక సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హుబ్లీ, జేజే న‌గ‌ర్‌, వాడి, పేలుళ్ల కేసులో నిందితుడయిన షేక్ అమీర్ అలీని గురించి పోలీసులు ఎంతో కాలంగా గాలిస్తున్నారు. ఎట్ట‌కేల‌కు ఈరోజు పోలీసుల చేతికి చిక్కాడు. కృష్ణా జిల్లాకు చెందిన షేక్ అమీర్ అలీ గత 16 ఏళ్లుగా అజ్ఞాతంలోనే ఉన్నాడు. నల్గొండ జిల్లాలో ఇతను ఉన్న‌ట్లు పక్కా సమాచారం అందడంతో క‌ర్ణాట‌క సీఐడీ అధికారులు తెలంగాణ పోలీసుల‌తో క‌లిసి వెళ్లి అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News