: ప్రత్యేకహోదా కోసం చంద్రబాబు తగినంత కృషి చేయట్లేదు: నాదెండ్ల మనోహర్


ఏపీకి ప్రత్యేక హోదా విషయమై సీఎం చంద్రబాబు నాయుడు తగినంత కృషి చేయట్లేదని మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్యాకేజీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎంతో అనుభవం ఉన్న సీఎం చంద్రబాబు ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే విషయమై తగినంత కృషి చేయాలన్నారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయని పక్షంలో బీజేపీపై కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి తెస్తుందని మనోహర్ అన్నారు.

  • Loading...

More Telugu News