: మా ఓపిక నశిస్తోంది!... జగన్ యత్నాన్ని స్వాగతిస్తున్నామన్న గల్లా!
ఏపీకి ప్రత్యేక హోదా కోసం తాము సాగిస్తున్న పోరు, విపక్షాలు చేస్తున్న యత్నాలపై టీడీపీ యువ నేత, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కొద్దిసేపటి క్రితం ఆసక్తికర కామెంట్లు చేశారు. కొద్దిసేపటి క్రితం ఢిల్లీలోని పార్లమెంటు ఆవరణలో మీడియాతో మాట్లాడిన గల్లా... ఏపీకి ప్రత్యేక హోదాను కేంద్రం ప్రకటిస్తుందని వేచి చూస్తున్నామని, ఈ క్రమంలో తమ ఓపిక పూర్తిగా నశిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. అదే సమయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహా విపక్షాలకు సంబంధించిన ఏ పార్టీ నేత ప్రత్యేక హోదా కోసం చేసే యత్నాలనైనా స్వాగతిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.