: హత్యా?... ఆత్మహత్యా?: ఉరేసుకున్న అరుణాచల్ మాజీ సీఎం!
అరుణాచల్ ప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పనిచేసి ఇటీవలే పదవి నుంచి దిగిపోయిన ఆ రాష్ట్ర రాజకీయవేత్త కలిఖోపుల్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఇటా నగర్ లోని సీఎం అధికార నివాసంలోనే ఉంటున్న కలిఖోపుల్ నేటి ఉదయం ఉరేసుకున్న స్థితిలో విగతజీవిగా కనిపించారు. సిబ్బంది గుర్తించేటప్పటికే ఆయన మరణించి ఉన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి గత నెల దాకా సీఎంగా పనిచేసిన ఆయన ఇటీవలే పదవి నుంచి దిగిపోయారు. అయితే ఆయన ఇంకా సీఎం అధికార నివాసంలోనే ఉంటున్నారు. త్వరలోనే సీఎం అధికార నివాసాన్ని ఖాళీ చేయాల్సి ఉన్న తరుణంలో చనిపోవడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. గడచిన కొన్ని రోజులుగా ఆయన తీవ్ర మానసిక ఒత్తిడితో సతమతమవుతున్నట్లు స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి.