: ఈటల డ్రైవర్ ను చిత్రహింసలకు గురి చేసిన నయీమ్!... ఎన్ కౌంటర్ తో ఆలస్యంగా వెలుగులోకి ఘటన!


తెలంగాణ పోలీసులకు మోస్ట్ వాంటెడ్ గా మారిన గ్యాంగ్ స్టర్ నయీమ్... తాను బతికున్న కాలంలో కొనసాగించిన దందాలకు సంబంధించి సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. నిన్నటిదాకా పంటి బిగువునే నయీమ్ వేధింపులను భరించిన పలువురు ప్రముఖులు అతడు చనిపోయిన తర్వాత ఒక్కొక్కరుగా నోరు విప్పుతున్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ కీలక నేత, తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ కు నయీమ్ నుంచి ఎదురైన ఇబ్బంది కూడా కాస్తంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళితే... మాజీ మావోయిస్టు సాంబశివుడు హత్య అనంతరం ఆయన సోదరుడు రాములుకు కూడా నయీమ్ నుంచి బెదిరింపులు ఎదురయ్యాయి. ఈ క్రమంలో బెంబేలెత్తిపోయిన రాములు... ఈటలను శరణు వేడారు. దీంతో ప్రభుత్వంతో మాట్లాడిన ఈటల... రాములుకు భద్రత కల్పించారు. దీనిని మనసులో పెట్టుకున్న నయీమ్... ఈటలను ఏమీ చేయలేక, ఆయన డ్రైవర్ ను కిడ్నాప్ చేశాడు. అనంతరం ఆ డ్రైవర్ ను చిత్రహింసలకు గురి చేశాడు. విషయం తెలుసుకున్న ఈటల... పార్టీ పెద్దలకు ఈ విషయం చెప్పారు. దీంతో రంగంలోకి దిగిన కొందరు పార్టీ నేతలు నయీమ్ చెర నుంచి ఈటల డ్రైవర్ కు విముక్తి కల్పించారు.

  • Loading...

More Telugu News