: కేసీఆర్ బంధువులనే టార్గెట్ చేసిన నయీమ్!... గ్యాంగ్ స్టర్ వ్యవహారంపై సంచలన కథనాలు!


తెలంగాణ పోలీసులకు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ గా మారి నిన్న పాలమూరు జిల్లా షాద్ నగర్ లో చోటుచేసుకున్న ఎన్ కౌంటర్ చనిపోయిన నయీమ్ కు సంబంధించి పలు సంచలన విషయాలు వెలువడుతున్నాయి. ఓ కథనం ప్రకారం... నయీమ్ ఏకంగా టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ బంధువులనే టార్గెట్ చేశాడట. కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండే ఓ క్లాస్ 1 కాంట్రాక్టర్ పై కన్నేసిన నయీమ్... ఆయన నుంచి రూ.50 కోట్ల మేర వసూలు చేయాలని భావించాడట. అయితే నయీమ్ తో మాట్లాడేందుకు సదరు కాంట్రాక్టర్ ససేమిరా అన్నారట. దీంతో నేరుగా రంగంలోకి దిగిన నయీమ్... తన మనుషులతో సదరు కాంట్రాక్టర్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించి ఆయనను తీవ్ర భయాందోళనలకు గురి చేశాడట. ఈ క్రమంలో సదరు కాంట్రాక్టర్ నుంచి మొత్తం విషయం తెలుసుకున్న కేసీఆర్... నయీమ్ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆ కథనం చెబుతోంది.

  • Loading...

More Telugu News