: బులంద్‌షహర్ గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడు సహా ఇద్దరు అరెస్ట్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బులంద్‌షహర్ గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడు సహా ఇద్దరిని సోమవారం అర్ధరాత్రి ఉత్తరప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి దాటాక ఈ విషయాన్ని డీజీపీ జావేద్ అహ్మద్ ట్వీట్ చేశారు. ‘‘బులంద్‌షహర్ కేసులో మిగతా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నాం’’ అని ఆయన ట్వీట్ చేశారు. మీరట్‌లోని మవానా తహశీల్‌లో నిందితులను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సూత్రధారిగా భావిస్తున్న సలీం బవారియాతోపాటు జుబైర్, సాజిద్‌లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి మరిన్ని వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. గ్యాంగ్‌లోని ఇతర సభ్యుల గురించి ప్రశ్నిస్తున్నారు.