: నయీం విచిత్రం మనస్తత్వం.. బాల్యంలో తేళ్లు, పాములతో ఆటలాడుకునేవాడట!
పోలీసుల ఎన్ కౌంటర్ లో హతమైన నయీం చిన్నప్పటి నుంచే నేర ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. బాల్యంలో ఆట వస్తువులతో కాకుండా విషపూరిత తేళ్లు, పాములతో ఆటాడుకునే వాడట. నయీంకు ఉన్న ఈ విచిత్ర స్వభావం గురించి ఆయన సన్నిహితులు చెప్పారు. నయీం తండ్రి విద్యుత్ శాఖలో పనిచేసి పదవీవిరమణ పొందారు. నయీంకు ఒక తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నాడు. 1985లోనే యాదగిరి గుట్ట బ్రహ్మోత్సవాల్లో నాటు తుపాకీతో నయీం హల్ చల్ చేసిన సంఘటన నాడు సంచలనం సృష్టించింది. విద్యార్థి దశలో ఎస్ఎఫ్ఐలో, ఆ తర్వాత రాడికల్ స్టూడెంట్ యూనియన్ (ఆర్ఎస్ యు)లో చేరి క్రియాశీలంగా పని చేశాడు.