: ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు అందుకే ఇంగ్లీషులో మాట్లాడరు!: వైఎస్ జగన్ సెటైర్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీ పర్యటనకు వచ్చిన సందర్భాల్లో ప్రత్యేక హోదాపై మీడియా ముందు ఎప్పుడైనా ఇంగ్లీషులో మాట్లాడారా? అని వైఎస్సార్సీపీ అధినేత జగన్ విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధనలో భాగంగా జగన్ ఈరోజు ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. ఈ మేరకు ఒక వినతిపత్రం సమర్పించారు. అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా విషయమై మీడియా ముందు చంద్రబాబు ఇంగ్లీషులో మాట్లాడకపోవడానికి కారణం, తాను మాట్లాడేది ప్రధానికి నరేంద్ర మోదీకి అర్థమవుతుందనేనని అన్నారు. తాను ఏమి మాట్లాడింది మోదీకి అర్థమవుతుందనే భయం చంద్రబాబులో ఉందని, అందుకే ఆయనకు తెలియకూడదన్న ఉద్దేశంతోనే ఇంగ్లీషులో మాట్లాడరంటూ జగన్ చమత్కారంతో కూడిన విమర్శ చేశారు.