: జీఎస్‌టీ బిల్లుపై లోక్‌సభలో ఓటింగ్ షురూ.. అన్నాడీఎంకే సభ్యుల వాకౌట్
ఎన్నో అడ్డంకులను అధిగమించి రాజ్యసభలో ఆమోదం పొందిన వస్తు సేవలపన్ను (జీఎస్‌టీ) బిల్లును ఈరోజు లోక్‌సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. బిల్లుపై చర్చ అనంతరం ఓటింగ్ ప్రారంభమయింది. కాగా, అరుణ్‌జైట్లీ సభలో సభ్యులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అయితే, బిల్లుపై జైట్లీ ఇచ్చిన వివరణ తమను సంతృప్తిపరచలేదంటూ అన్నాడీఎంకే నాయకుడు పి.వేణుగోపాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం అన్నాడీఎంకే సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.