: యూపీలో ఒంటరిగానే బరిలో దిగుతాం: షీలా దీక్షిత్


యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఒంటరిగానే బరిలోకి దిగుతామని కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థి, ఆ పార్టీ సీనియర్ నేత షీలా దీక్షిత్ పేర్కొన్నారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీతోను పొత్తు పెట్టుకోబోమని అన్నారు. 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తాయని, కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. అయితే, ఏ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తాననే విషయమై ఆమె సమాధానం చెప్పలేదు. ఈ విషయమై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. గత పార్టీల పాలనతో యూపీ ప్రజలు విసిగిపోయారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని వారు కోరుకుంటున్నారని షీలా దీక్షిత్ అన్నారు. ఈ సందర్భంగా యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ పరిపాలనపై ఆమె విమర్శలు కురిపించారు. అఖిలేష్ పాలనలో శాంతి భద్రతలు లోపించాయని, మతసామరస్యం దెబ్బతిందని షీలా దీక్షిత్ ఆరోపించారు.

  • Loading...

More Telugu News