: రాష్ట్రపతితో జగన్ భేటీ... ప్రత్యేక హోదాపై వినతి!
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ మొదటి నుంచి గట్టిగా గళాన్ని వినిపిస్తోన్న వైఎస్సార్ సీపీ అధినేత జగన్ నేడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. పార్టీ ఎంపీలతో కలిసి వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో సమావేశమయ్యారు. ప్రత్యేక హోదాపై ఎంపీలతో కలిసి ఆయన ప్రణబ్‌కు వినతి పత్రాన్ని అందించారు. రాష్ట్రానికి హోదా రావాల్సిన ఆవశ్యకత, ఏపీ పరిస్థితులపై జగన్ వివరించినట్లు సమాచారం. హోదాకోసం ఢిల్లీలో జగన్ పలువురు నేతల మద్దతు కోరనున్నట్లు తెలుస్తోంది.