: కశ్మీర్ అంశంపై మాట్లాడేందుకు సయీద్ సలా ఉద్దీన్ ఎవరు?: వెంకయ్యనాయుడు ఫైర్
హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయీద్ సలాఉద్దీన్‌పై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కశ్మీర్ అంశంపై సలాఉద్దీన్ స్పందిస్తూ ఇటీవలే తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. భారత్, పాకిస్థాల మధ్య అణు యుద్ధం జరిగే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యలు చేశారు. దీనిపై వెంకయ్యనాయుడు స్పందిస్తూ.. కశ్మీర్ అంశంపై మాట్లాడేందుకు అసలు సలాఉద్దీన్ ఎవరని ప్రశ్నించారు. ఆయనకు ఆ అధికారం ఎవరిచ్చారని దుయ్యబట్టారు. సలాఉద్దీన్ హెచ్చరికలు భారత్‌పై పనిచేయవని వెంకయ్య అన్నారు. ఇటువంటి వారికి పాకిస్థాన్ తమ దేశంలో ఆశ్రయమివ్వడం సమర్థనీయమేనా? అని ఆయన ప్రశ్నించారు. పాక్ ఇటువంటి వారిపై పునరాలోచన చేయాలని అన్నారు. ఉగ్రవాదులు తమ ప్రచారం కోసమే ఇలా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.