: ఒంటరిగా 'స్టార్ బక్స్' షాపుకు వెళ్లి కాఫీ ఆర్డరిచ్చిన స్మృతి ఇరానీ!


‘జెడ్’ కేటగిరి భద్రత ఉన్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, సాదాసీదా వ్యక్తిలా కాఫీ ఆర్డరిచ్చారు. ఈ సంఘటన ఢిల్లీలోని స్టార్ బక్స్ కాఫీ షాప్ లో జరిగింది. నిత్యం భద్రత మధ్య ఉండే స్మృతి ఒంటరిగా అక్కడికి వెళ్లి కాఫీ ఆర్డర్ చేశారు. గన్ మెన్లు ఎవరూ లేకుండా సాదాసీదాగా వచ్చిన మంత్రిగారిని చూసిన తోటి వినియోగదారులు ఆశ్చర్యపోయారు. అయితే, అక్కడే ఉన్న రచయిత నిమిష్ దూబే ఆమెను గుర్తు పట్టి ఒక ఫొటో తీసి తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ ఫొటో ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది. స్మృతి ఇరానీ తరచుగా ఈ షాప్ కు వస్తుంటారని, క్యూలో నిలబడి కాఫీ ఆర్డర్ చేస్తారని, ఎంతో వినయంగా ఆమె ఉంటారని నిమిష్ దూబ్ తన పోస్ట్ లో పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News