: నదిలో పడిపోయిన స్కూల్ బస్సు.. 50 మంది చిన్నారులను కాపాడిన స్థానికులు


రాజ‌స్థాన్‌లో కురుస్తోన్న భారీ వ‌ర్షాల‌తో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. మరోపక్క ప్రమాదాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. బిల్వాడా జిల్లాలో ఓ పాఠ‌శాల బ‌స్సుకు తృటిలో పెను ప్ర‌మాదం త‌ప్పింది. 50 మంది విద్యార్థుల‌తో వెళుతున్న బ‌స్సు నీటి ఉద్ధృతికి కొట్టుకుపోయి నదిలో ప‌డిపోయింది. గ‌మనించిన స్థానికులు వెంట‌నే అప్ర‌మ‌త్త‌మ‌యి బ‌స్సులో చిక్కుకున్న చిన్నారుల‌ను కాపాడారు. బ‌స్సు ఆచార్య విద్యాసాగర్ పాఠశాలకు చెందింది. ఓ చిన్న వంతెనను దాటుతుండగా ఈ ఘ‌ట‌న జ‌రిగింది. చిన్నారుల‌ను కాపాడిన స్థానికుల‌ను అధికారులు అభినందించారు.

  • Loading...

More Telugu News